Saturday, January 22, 2011

జనవరి సంచిక 2011

పౌరహక్కుల యోధుడు డాక్టర్ బినాయక్ సేన్ జీవితశిక్షను వెంటనే రద్దు చేయాలి. బేషరతుగా విడుదల చేయాలి. రాయపూరు సెషన్స్ కోర్టు డాక్టర్ బినాయక్ సేన్ రాజద్రోహ నేరం , భారత రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, కుట్ర చేయడం వంటి ఆరోపణలు రుజువయ్యాయని యావజ్జీవ కారాగారం శిక్ష విధించింది.

సాక్ష్యాలుగా రాయపూర్ జైలులో ఉన్న వృద్ధ మావోయిష్టు ఖైదీ నారాయణ సన్యాల్ నుండి ఒక లేఖ తీసుకెళ్ళి కలకత్తాకు చెందిన వ్యాపారి పీయూష్ గుహ కు అందించాడని, మావోయిష్టు పార్టీ ప్రచురించే మార్చ్ అనే 30 పత్రికలు ఆయన ఇంట్లో దొరికినవి, మొదటి ఆరోపణకు సాక్షులు పోలీసులే. మార్చ్ పత్రికలు పోష్టుద్వారా అందినవి , ఆ పత్రికలు నిషేధింపబడినవి కావు.

డాక్టర్ బినాయక్ పేద ప్రజల డాక్టరు. శిశు వైద్యంలో మాష్టర్ డిగ్రీ (యం.డి.) పొందిన వ్యక్తి. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా పనిచేశారు. గిరిజన ప్రాంతంలోనూ బొగ్గుగని కార్మికులకు స్వంతగా వైద్యశాల స్థాపించి వైద్యం చేశాడు. సల్వంజుడు అనే ప్రయివేటు సాయుధముఠా చేస్తున్న పనులను వ్యతిరేకించాడు. పౌర హక్కుల సంఘం కార్యదర్శిగా , అధ్యక్షుడుగా పనిచేసాడు. సల్వాంజుడుపై, పోలీసులపై కోర్టులో కేసులు పెట్టాడు.

బివాయక్ సేన్ సేవలను గుర్తించి ఇండియాలోని, విదేశాల్లోనుగల హెల్త్ ఫౌండేషన్లు ఆయనకు అవార్డులు ఇచ్చాయి. ఆశ ఫధకానికి ఈయన రూపొందించిన మితానిన్ కార్యక్రమమే ఆధారం.
బినాయక్ సేన్ పై విధించిన శిక్ష న్యాయసూత్రాలకు విరుద్ధమని ఓపిడిఆర్ భావిస్తుంది.